కరోనాపై యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

ఆంధ్రప్రదేశ్
7 Views

తూర్పుగోదావరి : గండేపల్లి మండలంలోని మండల్ పరిషత్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మండల అధికారులు ఎంపీడీవో జాన్ లింకన్, సబ్ ఇన్స్పెక్టర్ తిరుపతి రావు, ఈఓపిఆర్ డి మూర్తి, వ్యవసాయ అధికారి విశ్వనాథం పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం కరోనా వైరస్ పై 144 సెక్షన్ అమల్లో ఉన్నందున పోలీస్ అధికారులు అత్యవసర వస్తువులకు సంబంధించిన వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నామని, అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని నిలుపుదల చేయాలని సూచించారన్నారు. అదే ఇక్కడికి వచ్చిన వారైతే వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వారిని వదలాలని తెలిపారు. మండలంలో డ్రైనేజీలు పూడికతీత బ్లీచింగ్‌ పౌడర్, దోమల మందు పిచికారి చేయాలని సూచించారన్నారు. అదేవిధంగా త్రాగునీరు సమస్య లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని శుభ్రత పరిశుభ్రత పాటించే విధంగా పంచాయతీ సిబ్బంది విధులు నిర్వహించాలన్నారు. విద్యుత్‌ అధికారులు అప్రమత్తంగా ఉండి విద్యుత్ అసౌకర్యం కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు. సంబంధిత అధికారులు కరోనా వైరస్ వల్ల నిర్వహిస్తున్న కర్ఫ్యూను దృష్టిలో ఉంచుకొని ఉద్యోగ బాధ్యతలను ఆరోగ్యవంతంగా నిర్వహించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *