రూ. లక్షా 70 వేల కోట్లతో భారీ ప్యాకేజీ… ఇవే కీలకం

రాజకీయం
4 Views

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాపై భరత్ ఫైట్ చేస్తోంది. అందులో భాగంగా వచ్చే నెల 14 వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించారు ప్రధాని మోడీ. ఇక లాక్ డౌన్ కారణంగా లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో కేంద్రం గరీబ్ కళ్యాణ్ పేరుతో లక్షా 70వేల కోట్ల రూపాయలతో భారీ ఆర్ధిక ప్యాకేజీని ప్రకటించింది. ఇక కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్యాకెజీలో పేర్కొన్న కొన్ని కీలక అంశాలను పరిశీలిద్దాం…

• నిరుపేదలకు రూ। 1।7 లక్షల కోట్ల ప్యాకేజీ
• “ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన” పేరుతో పధకం।
• రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బు। • 8।69 కోట్ల మంది రైతులకు రూ। 2000 మొదటి విడత విడుదల।
• ఏప్రిల్ మొదటివారంలో ఖాతాల్లోకి సొమ్ము।
• 80 కోట్ల మంది పేదలకు 5 కేజీల గోధుమలు, లేదా 5 కేజీల బియ్యంతో పాటు, 1 కేజీ పప్పు దినుసులు।
• ఆహారధాన్యాలు వచ్చే నెల నుంచి ఉచితంగా 3 నెలల పాటు సరఫరా।
• వైద్యులు, పారామెడికల్, హెల్త్ కేర్ రంగాల సిబ్బందికి రూ। 50 లక్షల విలువైన బీమా।
• 20 కోట్ల “జన్‌ధన్” మహిళా ఖాతాల్లో మూణ్ణెళ్ల పాటు రూ। 500 జమ।
• 3 కోట్ల మంది వృద్ధులు, దివ్యాంగులు, పెన్షనర్ల ఖాతాల్లోకి అదనంగా నెలకు రూ। 1000 చొప్పున మూణ్ణెళ్ల పాటు (రెండు విడతలుగా నేరుగా ఖాతాల్లోకి) జమ।
• “ఉజ్వల” పథకం లబ్దిదారులకు రానున్న 3 నెలలకు 3 గ్యాస్ సిలిండర్లు।
• 63 లక్షల మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ। 20 లక్షల వరకు తనఖా లేని రుణాలు, తద్వారా 7 కోట్ల కుటుంబాలకు లబ్ధి। ।

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *