మన ఆత్మస్థైర్యం చూసి ‘కరోనా’ పారిపోతుంది

తెలంగాణ
66 Views

దిల్లీ: కరోనాపై యుద్ధానికి రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ముందుకు కదులుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. దేశ ప్రజలను నెల రోజులుగా కరోనా అనేక రకాలుగా భయపెడుతున్నప్పటికీ ప్రజలు ధైర్యంగా ఎదుర్కొంటున్నారని అన్నారు. దిల్లీలోని కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ రాష్ట్రాలు, శాఖల మధ్య మరింత సమన్వయం ఉండాలని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ పూర్తి బాధ్యత తీసుకుని సమస్యల పరిష్కారానికి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రోజూ రాష్ట్ర ప్రభుత్వాలతో కంట్రోల్‌ రూం ద్వారా సంప్రదింపులు జరుపుతున్నట్లు వివరించారు. ఇక్కడ నుంచే ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు సలహాలు, సూచనలు ఇస్తూ సమస్యలను పరిష్కరిస్తున్నట్లు కిషన్‌ రెడ్డి వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *