చంద్రబాబు మీద నెటిజన్ల ఫైర్… కారణం తెలుసా ?

రాజకీయం
6 Views

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబునాయుడుకు తానేం మాట్లాడుతున్నారో కూడా అర్ధం కావటం లేదు. విషయం ఏదైనా, సందర్భం ఏదైనా సరే మీడియాతో మాట్లాడకుండా లేకపోతే జనాలకు కనబడకుండా ఒక్క రోజు కూడా ఉండలేడు. కరోనా వైరస్ గురించి మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న సహాయక చర్యలను చాలా తక్కువ చేసి మాట్లాడారు. అలాగే గతంలో తాను హుద్ హూద్ తుపాను సందర్భంగా జనాలకు అందించిన స్ధాయిలో నిత్యావసరాలు అందించాలని ప్రభుత్వానికి చెప్పటమే మరీ విడ్డూరంగా ఉంది. ఇక్కడే చంద్రబాబు తెలివితేటలపై అందరికీ అనుమానాలు మొదలైపోయాయి.

 

కరోనా వైరస్ సందర్భంగా రాష్ట్రం మొత్తం లాక్ డౌన్ అయ్యింది కాబట్టి అర్హులైన పేదలకు నెలకు సరిపడ 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పుతో పాటు వెయ్యి రూపాయలు ఇవ్వనున్నట్లు జగన్మోహన్ రెడ్డి ప్రకటించాడు. జగన్ అలా ప్రకటించాడో లేదో వెంటనే చంద్రబాబు ఇలా జాతిని ఉద్దేశిస్తు వీడియా సందేశాన్ని వదిలేశాడు. ప్రభుత్వం తీసుకుంటున్న సహాయక చర్యలు ఏమాత్రం సరిపోవన్నారు. హుద్ హుదూద్ తుపాను సందర్భంగా తాను ప్రతి బాధిత కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకున్నది సవివరంగా జాబితాతో వినిపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *