కేసీఆర్ మరో సంచలన నిర్ణయం… తెలంగాణ ప్రజలకు భారీ షాక్…?

తెలంగాణ
62 Views

తెలంగాణలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 41కు చేరింది. కేసీఆర్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో లాక్ డౌన్, రాత్రి పూట కర్ఫ్యూ ద్వారా కరోనాను మరింత కట్టడి చేయాలని సూచించారు. ఏ కారణం లేకుండా రోడ్లపైకి వచ్చేవారిపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తే మాత్రమే కరోనా నుంచి రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు.

ప్రజలు రాష్ట్రానికి విదేశాల నుంచి వచ్చిన వారు, వారి సన్నిహితుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. క్వారంటైన్ లో ఉన్నవారి విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో పకడ్బందీగా లాక్ డౌన్ లు, కర్ఫ్యూలు సరిగ్గా అమలవుతున్నాయని… రాబోయే రోజుల్లో మరింత పగడ్బందీగా అమలు చేయాలని చెప్పారు. సామాజిక దూరం పాటించి కరోనా భారీన పడకుండా కాపాడుకోవచ్చని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *