తెలంగాణలో 41కి చేరిన కరోనా కేసులు

తెలంగాణ
62 Views

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మరో రెండు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో సౌదీ నుంచి వచ్చిన మూడేళ్ల చిన్నారి, 43 ఏళ్ల మహిళ ఉన్నారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 41 కి చేరింది. బుధవారం ఉదయం నుంచి ఇప్పటివరకు ఎలాంటి పాజిటివ్ కేసు లేదని ప్రత్యేకంగా ఒక బులెటిన్ విడుదల చేసిన రాష్ట్ర ఆరోగ్య శాఖ.. కొద్ది సేపటికే మరో బులిటెన్ విడుదల చేసింది. మరో రెండు పాజిటివ్ కేసులు నమోదైనట్లు పేర్కొంది. అందులో ఒకటి ప్రైమరీ కాంటాక్టుగా ఒక మహిళ, మూడేళ్ల చిన్నారికి కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు. తెలంగాణలో ఇప్పటివరకు నమోదైన 41 కేసుల్లో 3 సంవత్సరాల చిన్నారికి కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడం మొట్టమొదటిదిగా చెప్పవచ్చు. ఈ చిన్నారి సౌదీ అరేబియా నుంచి వచ్చినట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో కాంటాక్టు కేసుల లిస్టు కూడా పెరుగుతోంది. నిన్నటి వరకు ఐదు కాంటాక్టు కేసులు ఉండగా ఇవాళ ఆరో కాంటాక్టుగా 43 ఏళ్ల మహిళ కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఉదయం నుంచి ఇప్పటివరకు 50 మంది పరీక్షలు, ఐసోలేషన్ కోసం అడ్మిట్ అయ్యారు.

ఇప్పటివరకు మొత్తంగా ఐసోలేషన్ వార్డుల్లో ఉన్న రోగులకు సంబంధించిన లిస్టును ఆరోగ్యశాఖ విడుదల చేసింది. ఐసోలేషన్ వార్డుల్లో 813 రోగులు చికిత్స పొందుతున్నారని తెలిపారు. పాజిటివ్ కేసులు పెరుగుతున్న తరుణంలో లాక్ డౌన్ కొంత తగ్గిస్తుందున్న సమయంలో మళ్లీ ఇప్పుడు మరో రెండు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో భయాందోళన మరింత పెరిగిందని చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *