కరోనాతో 21 ఏళ్ళ యువతి మృతి… అనారోగ్యమనేదే ఎరుగదు!

క్రైమ్
5 Views

లండన్: కరోనా వైరస్ బారిన పడి 21 ఏళ్ల యువతి మరణించింది. ఆమెకు అంతకు ముందు ఎటువంటి అనారోగ్యం లేదు. ఇలా అనారోగ్యం లేకుండా కరోనా బారినపడి మరణించిన అతి పిన్న వయస్కురాలు ఈమెనే అని గుర్తించారు. యుకెలోని బకింగ్‌హామ్‌షైర్‌లో నివసిస్తున్న చలోయి మిడిల్టన్ తల్లి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఇది వైరల్ అయ్యింది. దేశవ్యాప్తంగా ప్రజలు చలోయికి నివాళులు అర్పించారు. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో ఈ ఉదంతం ట్రెండింగ్ లో ఉంది. చలోయి కుటుంబ సభ్యులు ఆమెకు గతంలో ఎటువంటి అనారోగ్యం లేదని చెప్పారు. అందుకే ఈ ప్రాణాంతక వైరస్ ను తేలికగా తీసుకోవద్దని, ప్రజలంతా ఇంట్లోనే వుండాలని విజ్ఞప్తి చేశారు. కాగా ప్రపంచవ్యాప్తంగా, కరోనా వైరస్ సోకిన వారి కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *