కరోనా కారణంగా నాగార్జున హిట్ సినిమా సీక్వెల్ వాయిదా

సినిమా
9 Views

నాగార్జున కథానాయకుడిగా కొంతకాలం క్రితం వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాలో నాగార్జున పోషించిన ‘బంగార్రాజు’ పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. దాంతో ఆ పాత్ర పేరుతోనే ఒక సినిమా చేయాలని నాగార్జున భావించారు. అయితే కొన్ని కారణాల వలన ఈ సినిమా షూటింగు వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావొస్తుండటంతో, ఏప్రిల్ 2వ వారంలో రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టాలనుకున్నారు. అయితే కరోనా ఎఫెక్ట్ కారణంగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగు కూడా వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే వివిధ కారణాల వలన వాయిదా పడుతూ వచ్చిన ‘బంగార్రాజు’ .. కరోనా కారణంగా మరోసారి వాయిదా పడనుందన్న మాట. రమ్యకృష్ణ .. చైతూ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్న సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *