నాని కోసం ఈ దర్శకుడు ఇంత చేస్తున్నాడా?

సినిమా
12 Views

ఓ పక్క కరోనా వైరస్ గడగడలాడిస్తున్న విషయం తెలిసిందే. దీని భారిన పడిన ఇటలీ విల విల లాడుతోంది. రోజూ కూడా ఇటలీలో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. దీని దెబ్బకు అన్నీ లాకౌట్ అయిపోతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాలు రాష్ట్రాలన్నీ ఇప్పటికే లాకౌట్ ప్రకటించేశాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 31 వరకు జనతా కర్ఫ్యూని విధించారు. అయితే ప్రస్తుతం వచ్చిన సమాచారం ప్రకారం వచ్చే నెల ఏప్రిల్ 14 వరకు ఈ కర్ఫ్యూ కంటిన్యూ అవుతదని తెలిసింది. దీంతో షాపింగ్ మాల్స్‌తో పాటు థియేటర్స్ అన్నీ కూడా మూతపడ్డాయి. ఎక్కడి కక్కడ షూటింగ్‌లు ఆపేసి ఎవరికి వారు ఇంటిపట్టునే ఉంటున్నారు. దీంతో సినిమాల రిలీజ్‌లు కూడా వెనక్కివెళ్ళాయి. దీంతో స్టార్స్ అంతా ఎవరికి నచ్చిన పని వారు చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. అయితే ఓ దర్శకుడు మాత్రం ఈ సమయాన్ని కూడా వాడేసుకుంటున్నాడు.

 

తను చేస్తున్న సినిమా కోసం గేయ రచయితగా మారిపోయాడు. ఓ పాట రాసేస్తున్నాని చెబుతున్నాడు. ఆ దర్శకుడు మరెవరో కాదు శివ నిర్వాణ. ఇలా ఖాళీ దొరికిన్పుడేగా కదా అద్భుతమైన ఐడియాలు వచ్చేవి. మరి ఈ దర్శకుడికి వచ్చింది ఇక వెంటనే అమల్లో పెట్టేశాడు అంతే… నేచురల్ స్టార్ నాని హీరోగా ప్రస్తుతం `టక్ జగదీష్` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కరోనా వైరస్ కారణంగా షూటింగ్‌లన్నీ స్తంభించిపోవడంతో ఇంటికే పరిమతమైపోయిన శివ నిర్వాణ ఈ సినిమా కోసం ఓ అద్భుతమైన సిట్యువేషనల్ సాంగ్‌ని రాస్తున్నానని సోషల్ మీడియా వేదికగా వెల్లడించడం ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *