హెల్త్‌ ఇన్సూరెన్స్‌ …కరోనాకూ కవరేజీ ఇచ్చే పాలసీ!

బిజినెస్‌
10 Views

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇండియాలో ఆదివారం ఉదయం నాటికి కరోనా కేసుల సంఖ్య 324కు చేరింది. ప్రతి ఒక్కరూ ఈ మహమ్మారి గురించి భయపడుతున్నారు. ఇంతకీ మన ఇన్సూరెన్స్‌ పాలసీలు, ముఖ్యంగా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు కరోనా చికిత్సకు కవరేజీకి ఇస్తాయా లేదా అన్నది ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్న విషయం. దీంతో ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్ అథారిటీ (ఐఆర్‌డీఏ) ఈ విషయమై గతవారం సర్కులర్‌ ఇచ్చింది. తమ ఇన్సూరెన్స్‌ పాలసీల్లో కరోనాకూ కవరేజీ ఇచ్చే ఇన్సూరర్స్‌ ఇలాంటి బీమా క్లెయిములను త్వరగా పరిష్కరించాలని ఆదేశించింది. కరోనా క్లెయిమ్స్‌ను తిరస్కరించడానికి ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సూచించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కరోనాను మహమ్మారిగా ప్రకటించడంతో జనంలో ఆందోళన ఇంకా ఎక్కువయింది. కరోనా విషయంలో పాలసీహోల్డర్లకు వీలైనంత సాయం చేస్తామని ఎస్‌బీఐ జనరల్‌, ఎడల్‌వీస్‌ జనరల్‌, సిగ్నా మణిపాల్‌, బజాజ్‌ అలియాంజ్‌ వంటి ఇన్సూరెన్స్‌ కంపెనీలు ప్రకటించాయి. కరోనా ట్రీట్‌మెంట్‌ ఖర్చులను భరిస్తామని, క్వారంటైన్‌ ట్రీట్‌మెంట్‌ ఖర్చులనూ క్లెయిమ్‌ చేసుకోవచ్చని తెలిపాయి. అయితే కరోనాను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్యాండెమిక్‌గా (ప్రపంచవ్యాప్త వ్యాధి) ప్రకటించడంతో ఎన్ని ఇన్సూరెన్స్‌ కంపెనీలు దీనికి కవరేజ్‌ ఇస్తాయనేది చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *