టీ20 ప్రపంచకప్ పై ఈ 29న నిర్ణయం!!!

క్రీడలు
8 Views

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే అనేక క్రీడా టోర్నీలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కోవలోకి ఐసిసి పురుషుల టీ20 ప్రపంచకప్ చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 29న ఈ టోర్నీ నిర్వాహణపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ టోర్నీని అక్టోబర్ 18 నుంచి ఆస్ట్రేలియాలో నిర్వహించడానికి షెడ్యూల్ అయింది. అయితే కరోనా వైరస్ ఆసీస్‌లో విజృంభిస్తూ ఉండటంతో ఇప్పటికే రెండు వేల మందికి పైగా అక్కడ వ్యాధి ప్రభావితులయ్యారు. కంగారు దేశంలో ప్రస్తుతం లాక్‌డౌన్‌ నడుస్తోంది. ఇప్పటికీ తమ దేశ సరిహద్దులను మూసివేసిన ఆసీస్‌ మరో ఆరు నెలల పాటు దీన్ని కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక జరిగితే టోర్నీ నిర్వహణ సందిగ్ధంలో పడుతుంది. ఇదే విషయాన్ని చర్చించడం కోసం సభ్య దేశాలతో పాటు అనుబంధ దేశాలతో ఐసీసీ సమావేశం అవుతుంది. ఈ సమావేశంలో బీసీసీఐ తరపున కార్యదర్శి జై షా లేదా అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పాల్గొనే అవకాశం ఉంది. నిజానికి ఐసిసి చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడైన షానే ఈ సమావేశానికి హాజరవుతారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచమంతా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే మెజారిటీ దేశాలకు విస్తరించిన ఈ వైరస్ కారణంగా మూడు లక్షల మందికి పైగా ప్రభావితులయ్యారు. దాదాపు 16 వేల మందికి పైగా తమ ప్రాణాలను కోల్పోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *