ట్విట్టర్ ఖాతా పేరు మార్చేసిన రవిచంద్రన్ అశ్విన్

క్రీడలు
7 Views

చెన్నై: టీమిండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ తన ట్విట్టర్ ఖాతా పేరు మార్చేశాడు. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో తన అభిమానులను మరింత అప్రమత్తం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ‘లెట్స్ స్టే ఇండోర్స్ ఇండియా’ అంటూ పేరు మార్చేశాడు. సామాజిక దూరం ఆవశ్యకతపై అవగాహన పెంచే ఉద్దేశంతో తన ట్విట్టర్ ఖాతా పేరును ఇలా మార్చుకున్నాడు.

కరోనా వైరస్‌పై వస్తున్న ప్రామాణిక వార్తలు సహా అన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాత వచ్చే రెండు వారాలు చాలా కీలకమని అనిపిస్తోందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. రాబోయే రెండు వారాలు దేశంలోని ప్రతీ నగరం ఎడారిలా కనిపించాలని, ఎందుకంటే వైరస్ కనుక పెరిగితే అల్లకల్లోలం అయిపోతుందని ఆందోళన వ్యక్తం చేశాడు. మనది చాలా జనసాంద్రత కలిగిన దేశమన్న సంగతిని గుర్తు పెట్టుకోవాలని, దేశంలోని చాలామందికి సరైన సమాచారం అందడం లేదని అశ్విన్ ఆవేదన వ్యక్తం చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *