సీఎస్‌కే, ఆర్‌సీబీకి మధ్య తేడా అదే!

క్రీడలు
9 Views

దిల్లీ: ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు ఎంతో బలమైనవి. ధోనీ సారథ్యంలో సీఎస్‌కే ట్రోఫీని మూడు సార్లు ముద్దాడగా, కోహ్లీ నడిపిస్తున్న ఆర్‌సీబీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా అందుకోలేకపోయింది. అయితే న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ బ్రెండన్‌ మెక్‌కలమ్‌ రెండు జట్ల మధ్య ఉన్న వ్యత్యాసం గురించి వివరించాడు. ఈ విషయాన్ని ప్రముఖ క్రికెట్‌ నిపుణుడు స్కైల్డ్‌ బెర్నీ ‘క్రికెట్ 2.0: ఇన్‌సైడ్‌ ది టీ20 రివల్యూషన్‌’ పుస్తకంలో పేర్కొన్నాడు. మెక్‌కలమ్‌ ఐపీఎల్‌లో ఇరు జట్లకు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.

”ఒక జట్టు.. తమ వద్ద ఎవరెవరు ఆటగాళ్లు ఉన్నారో పరిశీలించి కృషి చేస్తారు. ఆ జట్టు ఎంపిక వారి విధేయతను తెలియజేస్తుంటుంది. మరోకటి అత్యుత్తమ జట్టును తయారు చేయాలని ప్రయత్నిస్తుంటుంది. వాళ్లకి మైదానంలో ఎలా ఆడాలనే పక్కా ప్రణాళిక ఉండదు. సీఎస్‌కేతో పోల్చుకుంటే ఆర్‌సీబీ జట్టులో ఎక్కువ మార్పులు చేస్తుంది” అని మెక్‌కలమ్‌ పేర్కొన్నాడు. కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తుండటంతో ఐపీఎల్‌ 13వ సీజన్‌ను ఏప్రిల్‌ 15 వరకు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *