రెండు కార్లు ఢీ: తొమ్మిది మందికి గాయాలు

క్రైమ్
24 Views

మేడ్చల్: జిల్లాలోని మేడ్చల్ మండలం దాబిల్పూర్ పరిధి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. భారత్ పెట్రోల్ పంపు వద్ద రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. తొమ్మిది మందికి గాయాలయ్యాయి. స్థానికులు 108కు కాల్ చేయడంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడం జరిగింది. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *