కరీంనగర్లో ఘోర ప్రమాదం: ఒకరు మృతి

క్రైమ్
26 Views

కరీంనగర్‌: కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని అల్గునూరు వద్ద ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. కరీంనగర్‌- హైదరాబాద్‌ రహదారిపై ఉన్న మానేరు వంతెనపై నుంచి ఓ కారు అదుపుతప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్‌ అనే వ్యక్తి మృతి చెందగా, ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. వంతెనపై నుంచి కారును పరిశీలిస్తున్న క్రమంలో కిందపడి వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ కానిస్టేబుల్‌ శంకర్‌ తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు శ్రీనివాస్‌ కరీంనగర్‌లోని సుభాష్‌నగర్‌ వాసిగా గుర్తించారు. బాధితులు కరీంనగర్‌ నుంచి వరంగల్‌ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో హైదరాబాద్‌-కరీంనగర్‌ రహదారిపై ట్రాఫిక్‌ స్తంభించింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *