ఒక్క ఓటుతో గెలిచిన అభ్యర్థులు…

తెలంగాణ
31 Views

కొత్తపల్లి: కరీంనగర్‌ వ్యవసాయ సహకార సంఘం ఎన్నికల్లో తొమ్మిదో వార్డు అభ్యర్థి ఉల్లెందుల లక్ష్మి ఒక్క ఓటుతో గెలుపొందారు. 9వవార్డు ఎస్సీ మహిళకు రిజర్వేషన్‌ చేయగా నాగులమల్యాల గ్రామానికి చెందిన ఉల్లెందుల లక్ష్మి, నాయిని రాజ్యలక్ష్మి బరిలో నిలిచారు. మొత్తం 121 ఓట్లు పోలవగా, ఉల్లెందుల లక్ష్మికి 60, నాయిని రాజ్యలక్ష్మికి 59ఓట్లు పోలయ్యాయి. రెండు ఓట్లు చెల్లనివిగా ఎన్నికల అధికారులు గుర్తించారు. ఒకబ్యాలెట్‌లో రెండు గుర్తులపై ఓటు వేయగా, మరోదానిలో ఎలాంటి ఓటు వేయకుండా ఖాళీగా వేశారు. దీనితో రెండు ఓట్లు వారి ఫలితాలనే మార్చాయని గ్రామస్థులు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *