అన్నతో సరే.. తమ్ముడితో రొమాన్స్ ఎలా ఉంది?

సినిమా
33 Views

అన్నదమ్ములతో తెరను పంచుకునే అరుదైన ఛాన్స్ కొందరికే దక్కుతుంది. ఇంతకుముందు అక్కినేని బ్రదర్స్ నాగచైతన్య- అఖిల్ ఇద్దరితోనూ రొమాన్స్ చేసింది బెంగళూరు బ్యూటీ నిధి అగర్వాల్. నాగచైతన్యతో సవ్యసాచి.. అఖిల్ తో మిస్టర్ మజ్ను చిత్రాల్లో నటించింది. ఆ సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా అక్కినేని నాయికగా పాపులరైంది. ఇటీవలే ఈ భామ ఇస్మార్ట్ శంకర్ తో హిట్టందుకున్న సంగతి తెలిసిందే.ఇక నిధి సంగతి సరే కానీ.. తనలాగే వేరొక అమ్మడికి అన్నదమ్ములిద్దరితో ఛాన్స్ దక్కింది. ఇంతకీ ఎవరీ భామ? అంటే.. పూజా హెగ్డే. 2014లో నాగచైతన్య సరసన `ఒక లైలా కోసం` (విజయ్ కుమార్ కొండా దర్శకుడు) చిత్రంలో నటించిన పూజా .. ఇప్పుడు తమ్ముడు అఖిల్ సరసన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్`లో నటిస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. అన్నతో రొమాన్స్ చేశాక ఆరేళ్లకు తమ్ముడితో ఛాన్స్ దక్కింది. ఇది రేర్ మూవ్ మెంట్ అనే చెప్పాలి. ఇంతకీ అన్న బెటరా.. తమ్ముడు బెటరా? ఎవరు రొమాన్స్ లో బెస్ట్? అన్నది పూజానే చెప్పాల్సి ఉంటుంది. లేదంటే సినిమా చూశాక ఆడియెన్ డిసైడ్ చేయాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *