ఐటీ ఉచ్చులో అవినీతి చక్రవర్తి

క్రైమ్
20 Views

అమరావతి : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి అవినీతి బాగోతంలో స్వల్ప భాగం.. రూ.2,000 కోట్లకుపైగా నల్లధనాన్ని గుర్తించినట్లుగా గురువారం ఐటీ శాఖ కార్యదర్శి సురభి అహ్లూవాలియా విడుదల చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రధాన కాంట్రాక్టర్ల నుంచి బోగస్‌ సబ్‌ కాంట్రాక్టర్ల ద్వారా కమీషన్ల రూపంలో కొల్లగొట్టిన ప్రజాధనాన్ని ‘హవాలా’ వ్యాపారి హసన్‌ అలీ ద్వారా సింగపూర్‌కు తరలించి… అక్కడి నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రూపంలో సన్నిహితుడికి చెందిన సంస్థకు రప్పించి, చంద్రబాబు జేబులో వేసుకున్న తీరు వెలుగులోకి వచ్చింది. చంద్రబాబు రూ.2,000 కోట్లకుపైగా దోపిడీ చేసినట్లు గతంలో ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా(పీఎస్‌) పని చేసిన పెండ్యాల శ్రీనివాస్‌ డైరీల ఆధారంగానే వెల్లడైంది. ఇది ఆంధ్రా అనకొండ చంద్రబాబు అవినీతి చరిత్రలో స్వల్ప భాగమని, మిగతా సన్నిహితులు, కోటరీ కాంట్రాక్టర్లపై ఐటీశాఖ దాడులు చేస్తే, అక్రమాల చరిత్ర మొత్తం బయటపడుతుందని, రూ.లక్షల కోట్ల నల్లధనం వెలుగులోకి వస్తుందని ట్యాక్సేషన్‌ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

⇔ హైదరాబాద్, విజయవాడ, కడప, విశాఖపట్నం, పూణే, ముంబయి తదితర ప్రాంతాల్లో 40 చోట్ల ఐటీ శాఖ ఫిబ్రవరి 6 నుంచి 10వ తేదీ వరకూ సోదాలు నిర్వహించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *