రూ. 2 వేల కోట్లు: చంద్రబాబుకు ‘లైవ్‌మింట్‌’ ఫోన్‌!

రాజకీయం
40 Views

హైదరాబాద్‌: దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన ఆదాయ పన్ను శాఖ సోదాల పై టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంతవరకు నోరు విప్పకపోవడం అందరినీ విస్మయపరుస్తోంది. ప్రతీ చిన్న విషయానికి పెద్ద ఎత్తున రాద్దాంతం చేసే చంద్రబాబు.. ఐటీ సోదాల్లో రూ. 2 వేల కోట్ల బినామీ సొమ్ము బయటపడిన విషయంపై మౌనం వీడకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు మాజీ పీఎస్‌ వద్ద భారీగా అక్రమ సొమ్ము దొరికిన విషయంపై స్పందించాల్సిందిగా… లైవ్‌మింట్‌ వెబ్‌సైట్‌ ప్రతినిధులు టీడీపీకి ఈ- మెయిల్‌ చేయడం సోషల్‌ మీడియాలో చర్చకు దారి తీసింది. ( చంద్రబాబు అవినీతి: మచ్చుకు రూ.2,000 కోట్లు )

కాగా ఫిబ్రవరి 6 వ తేదీ నుంచి హైదరాబాద్, విజయవాడ, కడప, విశాఖపట్నంతో పాటు పుణె సహా 40 ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో మొత్తంగా 2 వేల కోట్ల రూపాయల మేరకు అక్రమంగా తరలించిన వివరాలు లభ్యమైనట్లు ఐటీ శాఖ గురువారం పత్రికా ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఒక ప్రముఖుడి వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి ఇంట్లో కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఐటీ దాడులపై స్పందించాల్సిందిగా లైవ్‌మింట్‌ ప్రతినిధులు చంద్రబాబుకు ఫోన్‌ చేసినట్లు తమ ఆర్టికల్‌లో పేర్కొన్నారు. ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా చంద్రబాబు స్పందించలేదని.. దీంతో టీడీపీకి ఈ- మెయిల్‌ పెట్టినట్లు తెలిపారు. రూ. 2 వేల కోట్లతో మీకు సంబంధం ఉందా? లేదా అని మెయిల్‌లో అడిగినట్లు సమాచారం. ( ఐటీ దాడుల్లో విస్మయకర విషయాలు )

ఇక ఐటీ దాడులపై చంద్రబాబు ఇంతవరకు స్పందించకపోయినా.. తమపై బురద జల్లుతున్నారంటూ టీడీపీ ఎల్లో మీడియాలో ప్రెస్‌మీట్లు పెట్టీ మరీ ఊదరగొట్టడం గమనార్హం. ఈ నేపథ్యంలో వివరణ కోరిన.. లైవ్‌మింట్‌ ప్రతినిధులకు మాత్రం వారు సమాధానం ఇవ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ- మెయిల్‌కు సంబంధించిన లైవ్‌మింట్‌ కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *