విజయసాయిరెడ్డికి షాక్ ఇచ్చిన జగన్… కేంద్ర కేబినేట్ లోకి ఆ ఇద్దరు…?

రాజకీయం
37 Views

ఏపీ సీఎం వైయస్ జగన్ వరుస ఢిల్లీ పర్యటనలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ పరిణామాలలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మూడు రోజుల క్రితం ప్రధాని నరేంద్రమోదీతో దాదాపు గంట సమయం భేటీ అయిన జగన్ నిన్న అమిత్ షా తో అరగంట భేటీ అయ్యారు. పలు రాజకీయ అంశాల గురించి ప్రధానంగా సీఎం జగన్ మోదీ, అమిత్ షాలతో చర్చించినట్టు తెలుస్తోంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మోదీ కేబినేట్ లో వైసీపీ చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీ సీఎం జగన్ కేంద్ర కేబినేట్ లో చేరే వైసీపీ మంత్రుల జాబితాను కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. మొదటి నుండి కేంద్ర కేబినేట్ లో వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి చోటు దక్కుతుందని భావించినా కొన్ని కారణాల వలన విజయసాయిరెడ్డి పేరును జగన్ ఫైనలైజ్ చేయలేదని తెలుస్తోంది. విజయసాయిరెడ్డి ఏపీ ప్రభుత్వానికి ఢిల్లీలో ప్రత్యేక సలహాదారుడిగా ఉండటంతో పాటు పార్లమెంటరీ నేతగా కూడా ఉన్నారు. జగన్ విజయసాయిరెడ్డి కొన్ని కేసుల కారణంగా కోర్టుకు హాజరు కావాల్సి ఉండటంతో కేంద్ర కేబినేట్ లో ఛాన్స్ ఇవ్వలేదని తెలుస్తోంది. అమిత్ షా సీఎం జగన్ ను ఏపీకి వచ్చే రాజ్యసభ సీట్లలో ఒకటి బీజేపీకి కేటాయించాలని కోరినట్టు అమిత్ షా ప్రతిపాదనకు జగన్ అంగీకరించినట్టు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *