ప్రియురాలితో వాలంటైన్స్‌డే రొమాన్స్… భర్తకు ఎదురొచ్చిన భార్య..

క్రైమ్
77 Views

Valentines Day | వాలంటైన్స్ డే అంటే ప్రియుడు, ప్రియురాలి కోసం. చాలా రొమాంటిక్‌గా జరుపుకోవాలని లవర్స్ అనుకుంటారు. ఆ లవర్స్ కూడా అనుకున్నారు. అనుకున్నదే తడవుగా ఆ యువకుడు తన ప్రియురాలిని వాలంటైన్స్ డే రోజు షాపింగ్‌కి తీసుకుని వెళ్లాడు. షాపింగ్ మాల్‌లో ఎంచక్కా దుస్తులు కొనుక్కున్నారు. ఐస్‌క్రీమ్ తిన్నారు. అయితే, అప్పుడు ఎదురైంది అసలు సీన్. ఆ యువకుడి భార్య అమ్మోరు తల్లిలా ఎదురొచ్చింది. షాపింగ్ మాల్‌లోనే భర్తను పట్టుకుని దులిపేసింది. తన భర్త పక్కన ఉన్న ప్రియురాలిని కూడా చితక్కొట్టింది. బీహార్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

ప్రియురాలితో కలసి ఎంజాయ్ చేస్తున్న భర్తకు అతడి భార్య ఎదురవగానే ఆ యువకుడి ముఖంలో రంగులు మారిపోయాయి. వెంటనే అక్కడి నుంచి తప్పించుకోవాలనుకున్నా ఎదురుగా ఉన్న ప్రియురాలిని వదిలి పెట్టి వెళ్లలేక ఉండిపోయాడు. దీంతో అతడిని పట్టుకుని చెంప ఛెళ్లుమనిపించిందా భార్య. మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నామని, తమకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని ఆ భార్య చెప్పింది. అయితే, ఇప్పుడు తన ముఖం చూడకుండా మరో యువతితో ప్రేమాయణం నడిపిస్తున్నాడని ఆరోపించింది. పది మందిలో పట్టుకుని భార్య చావబాదడంతో ఆ భర్త బిక్కముఖం వేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *