భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు…!?

బిజినెస్‌
11 Views

పెట్రోల్ డీజిల్ ధరలు ఒకరోజు ఉన్నటు మరొకరోజు ఉండవు.. ఒకరోజు భారీగా పెరిగితే మరో రోజు భారీగా తగ్గుతాయి.. ఇలా తగ్గుతూ పెరుగుతున్న సమయంలో గత రెండు రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు బంగారం ధరలు మళ్ళి భారీగా తగ్గాయి.

ఇంకా ఈ నేపథ్యంలోనే నేడు శనివారం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 10 పైసలు తగ్గుదలతో 76.35 రూపాయిలకు చేరింది. అలాగే లీటర్ డీజిల్ ధర 14 పైసలు తగ్గుదలతో 70.55 రూపాయిల వద్దకు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర రూ.71.84 వద్ద, డీజిల్ ధర 5 పైసలు తగ్గుదలతో రూ.64.82కు చేరింది.

ఆర్ధిక రాజధాని అయినా ముంబైలో కూడా పెట్రోల్ , డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర 12పైసలు తగ్గుదలతో రూ.77.60 వద్దకు చేరాయి. డీజిల్ ధర 5 పైసలు తగ్గుదలతో రూ.67.88కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా కదిలాయి. కాగా కేవలం నెల రోజుల్లో పెట్రోల్, డీజిల్ పై ఐదు రూపాయిలు తగ్గింది. మరి ఈ పెట్రోల్ డీజిల్ ధరలు మరింత ఎప్పుడు క్షణిస్తాయో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *