అదానీకి మూడు విమానాశ్రయాలు

బిజినెస్‌
17 Views

ముంబయి : దేశంలోని మూడు కీలక విమానాశ్రయాలను అదానీ గ్రూపు స్వాధీనం చేసుకోనుంది. అహ్మదాబాద్‌, మంగళూరు, లక్నో విమానాశ్రయాల అభివృద్ధికి ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఎఐ)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మూడింటినీ 50 ఏళ్ల పాటు నిర్వహించేందుకు చేసుకున్న ఒప్పందం ఫిబ్రవరి 14 నుంచి అమల్లోకి వచ్చిందని అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ శుక్రవారం బిఎస్‌ఇ ఫైలింగ్‌లో తెలిపింది. ఇవి అదానీ అహ్మదాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు, అదానీ లక్నో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు, అదానీ మంగళూరు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు లిమిటెడ్‌ పేర్లతో తమ గ్రూపులో భాగస్వామ్యంగా ఉండనున్నాయని వెల్లడించింది. 2018 డిసెంబర్‌లో ఆరు విమానాశ్రయాల ప్రయివేటీకరణ కోసం జరిగిన బిడ్డింగ్‌లో గౌతమ్‌ అదానీకి చెందిన గ్రూపు అన్నింటినీ సొంతం చేసుకుంది. ఇంకా జైపూర్‌, త్రివేండ్రం, గౌహతి విమానాశ్రయాలపై ఒప్పందం జరగాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *