మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్?

సినిమా
23 Views

యువ హీరో నితిన్ ప్రస్తుతం భీష్మ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఈ సినిమా తర్వాత వరుసగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఒక సినిమా ఉంది. దాంతో పాటు రంగ్ దే సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇలా ఈ ఏడాది వరుసగా రెండు సినిమాలతో బిజీగా ఉన్న నితిన్ మరో సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఠాగూర్ మధు, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మాతలుగా బాలీవుడ్ హిట్ మూవీ అందాదున్ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ ని ఫైనల్ చేశారు. ఇక ఈ సినిమాకి దర్శకుడుగా యువ దర్శకుడు మేర్లపాక గాంధీని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. నాని కృష్ణార్జున యుద్ధం తర్వాత మేర్లపాక గాంధీని సినిమాలు లేకుండా పోయాయి. కథలతో చాలా మంది హీరోలని కలిసి ఎవరు కూడా ఇతనితో సినిమా చేయడానికి ముందుకి రాలేదు. అయితే ఊహించని విధంగా ఇప్పుడు అందాదున్ సినిమా రీమేక్ అతని చేతికి వచ్చింది. ఇదిలా ఉంటే నితిన్ మూవీ షెడ్యూల్స్ ప్రకారం చూసుకుంటే ఈ సినిమా ఈ ఏడాది ఆఖరులోగాని లేదంటే వచ్చే ఏడాది మొదటి భాగంలో కాని విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి ఈ సినిమా ఈ యువ దర్శకుడుకి ఎంత వరకు హిట్ ఇచ్చి తిరిగి బూస్ట్ అందిస్తుందో అనేది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *