‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ నుండి పూజ ఫస్ట్ లుక్ రిలీజ్

సినిమా
22 Views

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ ప్రధాన పాత్రలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఒకపక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేసింది. ఇప్పుడు తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు. నిన్న చెప్పినట్టే ఈ రోజు ఈ సినిమా నుండి పూజ హెగ్డే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలరేట్’ విభా అంటూ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.కాగా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాను అఖిల్ పుట్టినరోజు కానుకగా ఏప్రిల్ 8న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *