కేంద్ర బడ్జెట్ ఓ బూటకం

తెలంగాణ
27 Views

కేంద్రబడ్జెట్‌ ఓ బూటకమనీ, పేదలు, మధ్యతరగతి ప్రజలకు వ్యతిరేకమనీ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్‌కౌర్‌ విమర్శిం చారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈనెల ఒకటిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కార్పొరేట్లు, పెట్టుబడిదారులు, సంపన్నుల కోసమేనని అన్నారు. సంపద సృష్టించే పేదలు, రైతులు, కార్మికులకు ఈ బడ్జెట్‌ వ్యతిరేకమని చెప్పారు. లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాలను కేంద్రం ఉపసంహ రించుకుంటోందని అన్నారు. బీపీసీఎల్‌, ఎల్‌ఐసీలో పది శాతం వాటా అమ్మాలని నిర్ణయించిందన్నారు. ఈ చర్యవల్ల ప్రజల్లో ఎల్‌ఐసీ పట్ల ఉన్న విశ్వాసం కోల్పోయి, పాలసీలను ఉపసంహరించుకునే ప్రమాదముందని చెప్పారు. ఎల్‌ఐసీ భవిష్యత్‌ అంధకారంలో వెళ్తుంద న్నారు. ఎయిరిండియాను వందశాతం అమ్మాలని ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *