ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

తెలంగాణ
19 Views

పెరిగిన గ్యాస్‌ ధర మంట పుట్టిస్తోంది. సామాన్యుడి నడ్డి విరుస్తోంది. పెంచిన ధరను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేశారు. రాస్తారోకో, ధర్నాలు చేసి నిరసన తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడలో సీపీఐ(ఎం), సీఐటీయూ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచరపల్లిలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం, కాంగ్రెస్‌ మహిళా విభాగం ఆధ్వర్యంలో నల్లగొండ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. సీపీఐ(ఎం), ఐద్వా ఆధ్వర్యంలో వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో నిరసనలు జరిగాయి. హసన్‌పర్తి మండల కేంద్రంలోని బస్టాండ్‌ సెంటర్‌లో రాస్తారోకో చేశారు. ఐద్వా అధ్వర్యంలో హన్మకొండలోని అంబేద్కర్‌ సెంటర్‌లో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌ ఎదుట రోడ్డుపై సీపీఐ(ఎం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *