నితిన్ కోసం వస్తున్న త్రివిక్రమ్

సినిమా
22 Views

యంగ్ స్టార్ నితిన్ చాలా జోష్ గా కనిపిస్తున్నాడు. అతని లేటెస్ట్ మూవీ ‘భీష్మ’పై అన్ని వర్గాల్లోనూ పాజిటివ్ బజ్ కనిపిస్తోందిఇక ఈ నెల 21న విడుదల కాబోతోన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా వస్తున్నాడు.సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ అంటే త్రివిక్రమ్ కు సెకండ్ హోమ్ బ్యానర్ లాంటిది. అదేటైమ్ లో ఈ బ్యానర్ లోనే నితిన్ కు కెరీర్ బెస్ట్ హిట్ ‘అ ఆ’ఇచ్చాడు. అప్పటి నుంచి త్రివిక్రమ్, నితిన్ మధ్య మంచి రాపోనే ఉంది. మరోవైపు భీష్మ దర్శకుడు వెంకీ కుడుముల కూడా త్రివిక్రమ్ వద్ద పనిచేసి ఉన్నాడు. ఈ అన్ని కారణాలతోనే ఈ నెల 17న(సోమవారం) జరిగే భీష్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా రావడానికి ఒప్పుకున్నాడట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *