సెమీస్‌లో పేస్‌ జోడీ

క్రీడలు
28 Views

బెంగళూరు: భారత డబుల్స్‌ టెన్నిస్‌ ఆటగాడు లియాండర్‌ పేస్‌ బెంగళూరు ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల డబుల్స్‌ క్వార్టర్స్‌లో ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ అబ్డెన్‌తో కలిసి పేస్‌.. ఆండ్రీ గొరన్సన్‌(స్వీడన్‌)-క్రిస్టోఫర్‌(ఇండోనేషియా) జోడీపై 7-5, 0-6, 10-7తో విజయం సాధించాడు. ఇంకా పురవ్‌ రాజా-రామ్‌కుమార్‌ రామనాథన్‌తో పాటు సాకేత్‌ మైనేని(భారత్‌)-మ్యాట్‌ రీడ్‌(ఆసీస్‌) జంట కూడా సెమీస్‌కు చేరారు. టాప్‌ సీడ్‌ చెంగ్‌ పెంచ్‌ (చైనీస్‌ తైపీ)-డెనీస్‌ (ఉక్రెయిన్‌) ద్వయంపై సాకేత్‌ జోడీ 3-6, 6-4, 10-8తో గెలిచి సంచలనం సృష్టించింది. ఫ్రెడెరికో సిల్వా (పోర్చుగల్‌)-నికోల మిలోజెవిక్‌ (సెర్బియా) జోడీపై పురవ్‌ రాజా-రామ్‌కుమార్‌ రామనాథన్‌ 6-4, 6-4తో విజయం సాధించారు. అయితే పురుషుల సింగిల్స్‌లో భారత పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్స్‌లో ప్రజ్నేశ్‌ గుణ్ణేశ్వరన్‌ 6-7 (5-7), 0-6తో బెంజిమన్‌ బొంజి(ఫ్రాన్స్‌) చేతిలో, సుమిత్‌ నాగల్‌ 3-6, 3-6తో బ్లజ్‌ రొలా(స్లోవేనియా) చేతిలో ఓడారు. వీరితో పాటు రామ్‌కుమార్‌, సాకేత్‌ మైనేని కూడా సింగిల్స్‌లో పరాజయాలను చవిచూశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *