మంధాన @ 4

క్రీడలు
27 Views

దుబా య్‌ : భారత మహిళా క్రికెటర్‌ స్మృతి మంధాన టీ20 ర్యాంకింగ్స్‌ బ్యాట్స్‌ వుమెన్‌ల జాబితాలో నాల్గో స్థానానికి ఎగబాకింది. శుక్రవారం అంతర్జాతీయ క్రికెట్‌మండలి(ఐసిసి) ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో మంధానతో పాటు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ టాప్‌ టెన్‌లో చోటు దక్కించుకున్నారు. బౌలర్ల విభాగంలో పూనమ్‌ యాదవ్‌ ఆరు స్థానాల్లో కోల్పోయి 12వ ర్యాంక్‌లో నిలిచింది. న్యూజిలాండ్‌కు చెందిన సూజీ బైట్స్‌ టాప్‌-3 నుంచి ఎగబాకి అగ్రస్థానానికి చేరింది. కివీస్‌కే చెందిన సోఫియా డెవైన్‌ రెండోస్థానంలో నిలిచింది. ఇటీవల జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్‌లో రాణించిన ఆస్ట్రేలియా ఓపెనర్‌ బెత్‌ మూనీ, మంధాన రెండు అర్ధసెంచరీలతో రాణించడంతో వీరి ర్యాంకింగ్స్‌లో మెరుగుదల కనబడింది. ఆసీస్‌కే చెందిన మెగ్‌ లానింగ్‌ మూడు స్థానాలు కోల్పోయి ఐదో స్థానంలో నిలిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *