న్యూజిలాండ్‌ ఎలెవెన్‌తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌

క్రీడలు
26 Views

హామిల్టన్‌: న్యూజిలాండ్‌ ఎలెవెన్‌తో జరుగుతున్న మూడురోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో కాకినాడ కుర్రాడు హనుమ విహారి సెంచరీతో కదం తొక్కగా… ఛటేశ్వర పుజారా తృటిలో సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. వీరిద్దరూ మినహా మరే బ్యాట్స్‌మన్‌ ఆశించినస్థాయిలో రాణించలేకపోయారు. ఐదు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును పుజారా(93; 211 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్‌), హనుమ విహారి(101; 182 బంతుల్లో 10ఫోర్లు, మూడు సిక్సర్లు) ఆదుకున్నారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత జట్టుకు ఆదిలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్లు పృథ్వీ షా(0), మయాంక్‌ అగర్వాల్‌(1), శుభమన్‌ గిల్‌(0) ఘోరంగా విఫలమయ్యారు. అనంతరం పుజారా, విహారి చక్కగా బ్యాటింగ్‌ చేసి ఐదో వికెట్‌కు 195 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఈ క్రమంలో పుజారా శతకం చేజార్చుకొని జేక్‌ గిబ్సన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కాసేపటికే విహారి శతకం తర్వాత రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుతిరిగాడు. తర్వాత రిషభ్‌ పంత్‌(7), సాహా(0), అశ్విన్‌(0), జడేజా(8) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. దీంతో తొలిరోజు టీమిండియా 263 పరుగులకు కుప్పకూలింది. మ్యాచ్‌ అనంతరం విహారి మాట్లాడుతూ జట్టు ఏ స్థానంలో ఆడమంటే అక్కడ ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. కొన్నిసార్లు జట్టు పరిస్థితులను అర్థం చేసుకోవాలని, అందుకు నిరాశ చెందకూడదని తెలిపాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *