కేజ్రీ ప్రమాణానికి ‘మినీ మఫ్లర్‌మ్యాన్‌’

జాతీయం - అంతర్జాతీయం
94 Views

దిల్లీ: ముచ్చటగా మూడోసారి దిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేందుకు అరవింద్‌ కేజ్రీవాల్‌ సిద్ధమవుతున్నారు. ఈ నెల 16న చారిత్రక రామ్‌లీలా మైదానంలో అశేష జనవాహిని మధ్య కేజ్రీ ప్రమాణస్వీకారం జరగనుంది. అయితే ఈ కార్యక్రమానికి ఓ ప్రత్యేక అతిథి రానున్నారట. ఎన్నికల ఫలితాల రోజున కేజ్రీవాల్‌ గెటప్‌లో కన్పించి తెగ వైరల్‌ అయిన ‘బేబీ మఫ్లర్‌మ్యాన్‌’ను ప్రమాణస్వీకారానికి ఆహ్వానించినట్లు ఆమ్‌ ఆద్మీ పార్టీ తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలో వెల్లడించింది. ‘సిద్ధంగా ఉండు జూనియర్‌!’ అని చిన్నారికి చెప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *