జై అమరావతి నినాదంతో మార్మోగుతున్న రాజధాని గ్రామాలు

ఆంధ్రప్రదేశ్
69 Views

అమరావతి సాధించుకునే వరకు తమ ఉద్యమం ఆగదని రైతులు తెగేసి చెప్పారు. మూడు రాజధానులపై ప్రభుత్వం వెనక్కి తగ్గేవరకు ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు. వియ్‌ వాంట్‌ జస్టిస్‌ అంటూ నినదించారు. 58వ రోజు కూడా సడలని పట్టుదలతో ఆందోళనలు చేపట్టారు. ధర్నాలు, నిరసనలతో రాజధాని గ్రామాలు మారుమోగాయి. మందడం, వెలగపూడి, తుళ్లూరు, కృష్ణాయపాలెం.. ఇలా ఆ ఊరు.. ఈ ఊరు అని తేడాలేకుండా 29 రాజధాని గ్రామాల్లో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది.

రైతులు, మహిళలు, వృద్ధులు, యువకులు.. పెద్దయెత్తున ఆందోళన, నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వంలో ఒక్కరికి కూడా తమ బాధ కనిపించడం లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించే వరకు ఇలాగే శాంతియుతంగా ఆందోళనలు కొనసాగుతాయిని స్పష్టం చేశారు.

58 రోజులుగా రైతులు అలుపన్నది లేకుండా పోరుబాటలో ఉన్నారు రైతులు. వేడుకైనా.. వేదనైనా.. అమరావతే తమ పరమావధి అంటున్నారు. బుధవారం వివాహ వేడుకలో జై అమరావతి నినాదం మార్మోగగా.. గురువారం తుళ్ళూరులో ఓ ఇంటి శంకుస్థాపన కార్యక్రమంలో కూడా ఉద్యమ హోరు కన్పించింది. ప్లకార్డులు చేతపట్టుకుని జై అమరావతి అంటూ రైతులు, మహిళలు నినదించారు. అమరావతి ప్లకార్డులు చేతపట్టుకునే దంపతులు ఇంటికి శంకుస్థాపన చేశారు. మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దని నినదించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *