ఏపీలో ఐటీ కలకలం.. 2వేల కోట్ల అక్రమ లావాదేవీలు!

ఆంధ్రప్రదేశ్
69 Views

IT Raids: తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సోదాలఫై ఇన్‌కమ్ టాక్స్ డిపార్టుమెంట్ ప్రకటన జారీచేసింది. మూడు ఇన్ఫ్రా కంపెనీల్లో 2000 కోట్ల లావాదేవీలు, అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. హైద్రాబాద్, విజయవాడ, ఢిల్లీ, పూణే, కడప, వైజాగ్ తో సహా మొత్తం 40 చోట్ల సోదాలు జరిగాయి. మూడు ఇన్ఫ్రాల ద్వారా కోట్లరూపాయల లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించిన ఈ మెయిల్, వాట్సాప్ ద్వారా జరిపిన లావాదేవీలు వివరాలు సేకరించారు అధికారులు. ఇటీవల ఏపీలో టిడిపి నాయకుల సన్నిహితులపై ఐటీ దాడులు జరుపగా దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలకు అకౌంట్లు లేనట్టుగా ఐటీ అధికారులు గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *