‘మూడు తీర్పులను పరిగణలోకి తీసుకోవాలి’

ఆంధ్రప్రదేశ్
76 Views

అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంపై ఏపీ హైకోర్టు గురువారం విచారణ చెపట్టింది. విచారణలో భాగంగా.. ప్రభత్వుం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరాం వాదనలను వినిపించారు. అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియాన్ని ప్రవేశపెడుతూ జారీచేసిన జీవో విద్యాహక్కు చట్టంలోని 29వ నిబంధనను ఉల్లంఘించలేదని తెలిపారు. భాషాపరంగా అల్ప సంఖ్యాకుల కోసం కొన్ని చర్యలను, వారి మాతృభాషా పరిరక్షణకోసం భద్రతా చర్యలను మాత్రమే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 350 నిర్దేశిస్తుందని ఆయన చెప్పారు. ఇలాంటి అంశాల్లో ఆచరించదగ్గ మూడు తీర్పులను కోర్టు పరిగణలోకి తీసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ముసాదా విధానాన్ని పరిశీలించాల్సిందిగా ఏజీ శ్రీరామ్‌ కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *