రానా ‘అరణ్య’ టీజర్ అదిరింది

సినిమా
11 Views

హైదరాబాద్‌ : దగ్గుబాటి రానా నటించిన ‘అరణ్య’ చిత్రం టీజర్ విడుదలైంది. తెలుగు, తమిళం, హిందీలో రూపొందుతోన్న ఈ చిత్రం ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్, వినోదం ప్రధానంగా సాగే ఈ సినిమాను ఏరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తుండగా, ప్రభు సాల్మన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో తమిళ నటుడు విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియా పిలగోన్కర్ తదితరులున్నారు. ఈ సినిమా టీజర్‌లో రానా డిఫరెంట్ లుక్ తో అలరించాడు. అడవిలో ఏనుగులను మచ్చిక చేసుకుని వాటితో సహవాసం చేసి అడవి తెగకు చెందిన వ్యక్తిగా ఆయన లుక్ ఉంది. మనిషి స్వార్థం కోసం అడవులను ధ్వంసం చేస్తోండడంతో అడవుల్లో నివసించే ప్రాణుల మనుగడకు ముప్పు ఏర్పడిందని.. ముఖ్యంగా ఏనుగులు మనుగడ కోల్పోయే పరిస్థితి ఏర్పడటంపై హీరోగా రానా చేసే పోరాటమే చిత్ర కథగా తెరకెక్కింది. ఈ సినిమా హిందీలో ‘హాథీ మేరా సాథి’, తమిళంలో ‘కాదన్’గా విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *