“నా సినిమా ట్రైలర్ ను డిలీట్ చెయ్యండి”

సినిమా
15 Views

ఎక్కడైనా సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి ఎంత వీలైత అంత సోషల్ మీడియాను ఉపయోగించుకుంటారు. కానీ సినీ నటి తాప్సి మాత్రం కాస్త వెరైటీగా ప్లాన్ చేసింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘థప్పడ్’. అంటే చెప్ప దెబ్బ. అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించారు. మొన్ననే ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. తాప్సి అందరిలాంటి హీరోయిన్ కాదు. హీరో పక్కన రెండు సన్నివేశాల్లో కనిపించి నాలుగు పాటల్లో అలరించే టైప్ అస్సలు కాదు. ఆమె ఏ సినిమా ఎంచుకున్నా అందులో సమాజానికి, ముఖ్యంగా ఆడవాళ్లకు ఉపయోగపడే మెసేజ్ ఏదో ఒకటి ఉంటుంది. అందుకే తనకంటూ బాలీవుడ్‌లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలిగారు. సాధారణంగా హీరోయిన్స్ దీపం ఉండగానే ఇల్లు చెక్కబెట్టుకోవాలని అనుకంటారు. అంటే వయసులో ఉన్నప్పుడే ఏ అవకాశం వచ్చినా వరుసగా సినిమాలు చేసేస్తూ ఉంటారు. కానీ తాప్సి అలా కాదు. ఏ హీరోయిన్ ధైర్యం చేయలేని పాత్రలో నటించారు. ‘సాండ్ కీ ఆంఖ్’ చిత్రంలో తాప్సి 60 ఏళ్ల వృద్ధురాలి పాత్రలో నటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *