‘ఆర్ఆర్ఆర్’ లేటెస్ట్ అప్‌డేట్: తారక్‌ను తీవ్రంగా కొట్టిన చరణ్!

సినిమా
12 Views

టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుకుంటున్న సినిమా ఏదంటే, ఎవరైనా ఠక్కున చెప్పే పేరు ‘ఆర్ఆర్ఆర్’. జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా ఇండియన్ టాప్ డైరెక్టర్స్‌లో ఒకరైన యస్.యస్. రాజమౌళి రూపొందిస్తోన్న ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని భాషల సినీ ప్రేమికులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘బాహుబలి’ వంటి ఇండియన్ ఇండస్ట్రీ రికార్డ్స్ ఫిల్మ్ తర్వాత రాజమౌళి తీస్తున్న సినిమా కావడంతో ‘ఆర్ఆర్ఆర్’పై అందరి దృష్టీ ఉండటం సహజం. దానికి తగ్గట్లే ఆ మూవీ ప్రి రిలీజ్ బిజినెస్ కూడా ఊహాతీతంగా జరుగుతోంది. ఒక్క ఇండియాలోనే 400 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ జరిగిన సినిమాగా ‘ఆర్ఆర్ఆర్’ సరికొత్త చరిత్రను సృష్టిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *