జాతీయ మీడియాతో బన్నీ ఇంటర్వ్యూ… అందుకోసమే…!!

సినిమా
77 Views

ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న విజయం అల వైకుంఠపురం సినిమాతో బన్నీని వరించింది. ఈ సినిమా విజయం సాధించడంతో బన్నీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. నాన్ బాహుబలి హిట్ ను సినిమా సొంత చేసుకోవడం విశేషం. ఈ మూవీ రూ. 157 కోట్ల రూపాయల షేర్ వసూలు సాధించింది. మొత్తం రూ. 260 కోట్లు గ్రాస్ వసూలు చేసిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా కాకుండా కేవలం ఒక ప్రాంతీయ సినిమాగా వచ్చి ఈ స్థాయిలో వసూళ్లు సాధించడంతో బన్నీ ఖుషి అవుతున్నాడు.

ఈ స్థాయిలో విజయం అందించిన త్రివిక్రమ్ కు కృతజ్ఞతలు తెలిపిన సంగతి తెల్సిందే. ఇప్పటి వరకు బన్నీ స్థానిక మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చిన బన్నీ, ఇప్పుడు జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. అల వైకుంఠపురంలో ప్రమోషన్స్ లో భాగంగా ఓ హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేశారు. అల్లు అర్జున్ ఆన్ ఎన్డిటివి పేరుతో బన్నీని ప్రశ్నలు అడగొచ్చట. వాటిని బన్నీ సమాధానం చెప్పబోతున్నారు. బన్నీ నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేస్తున్నారని వినికిడి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *