డాన్సులు రావంటే చేసి చూపించా- రశ్మిక మండన్న

సినిమా
12 Views

” నాకు డాన్సులు రావు అనుకుంటారు అంతా. కానీ ఒక పరిస్థితి వస్తే ఏదైనా చేయగలను. నేను మైండ్‌ బ్లాక్‌ పాటలో డాన్స్‌ చేస్తుంటే, అక్కడున్న వాళ్లు మీకు డాన్స్‌ ఇంత బాగా వచ్చా అని ఆశ్చర్యపోయారు. నేను చెప్పా అవసరం వస్తే ఏదైనా చేస్తా అని. డియర్‌ కామ్రేడ్‌, సరిలేరు నీకెవ్వరు నాకు రెండు భిన్నమైన చిత్రాలు. ప్రస్తుతం నటిగా తొలి దశలో ఉన్నాను కాబట్టి ప్రయోగాలు చేస్తున్నాను. ఎలాంటి పాత్రలో నటించడం సులువంటే చెప్పలేను. నేను ఏం చేయగలనో తెలుసుకుంటున్నాను. నాయికలంటే అందంగా ఉండాలి. నాకు మేకప్‌ వేసుకోవడం, బాగా అలంకరించుకోవడం ఇష్టముండదు. నాలాంటి హీరోయిన్‌లను తెరపై ప్రేక్షకులు చూస్తారా అని తొలి చిత్రానికి భయపడ్డాను. నటించే పాత్ర బాగుంటే గ్లామర్‌గా ఉండాలనేది పట్టించుకోరని అర్థమైంది. నేనెలా ఉంటానో అలా సహజంగా కనిపించడమే నాకిష్టం. బయటకు వెళ్లినప్పుడు ఏమాత్రం మేకప్‌ లేకుండా వెళ్తాను. సినిమాలోనూ అలాగే ఉంటానని చెబుతాను కానీ సినిమా కోసం యూనిట్‌ చెప్పినట్లు నడుచుకోవాలి కాబట్టి తప్పడం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *