‘మానస సరోవర్ హోటల్ యాజమాన్యం తప్పుడు ప్రచారం చేస్తోంది’

క్రైమ్
13 Views

హైదరాబాద్: మానస సరోవర్ హోటల్ యాజమాన్యం తమ కూతురి కుటుంబం ఆత్మహత్య యత్నం చేసిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని శ్రీవిద్య కుటుంబ సభ్యులు తెలిపారు. నేడు వారు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. తమ కూతురు శ్రీ విద్యతో మాట్లాడామని… రాత్రి రోటీ, పన్నీరు తినడం వల్లే ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పిందన్నారు.

రావి నారాయణ కుటుంబానికి ఎలాంటి సమస్యలు లేవని.. వీసా పని మీద బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చారన్నారు. యూఎస్ కాన్సులేట్ ఆఫీస్ దగ్గరలోనే మానస సరోవర్ హోటల్ ఉండడంతో… అదే హోటల్‌లో బస చేశారని తెలిపారు. ఫుడ్ పాయిజన్ వల్లే తమ పిల్లలు అస్వస్థతకు గురయ్యారని.. విహాన్(2) మాత్రం మృతి చెందాడని వెల్లడించారు. దీనికంతటికీ కారణమైన హోటల్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *