బాలయ్య బోయపాటి సినిమాలో వరుణ్ హీరోయిన్…!!

సినిమా
82 Views

బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో మూడో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరి కాంబినేషన్లో సింహ, లెజెండ్ సినిమాలు వచ్చాయి. ఈ రెండు కూడా భారీ విజయం సొంతం చేసుకున్నాయి. ఈ సినిమాలు విజయం సాధించడంతో ఇండస్ట్రీపై అంచనాలు భారీగా ఉన్న సంగతి తెలిసిందే.

బాలకృష్ణను ఇందులో కొత్తగా చూపించబోతున్నారు. బాలయ్య అఘోరా పాత్రలో కనిపిస్తున్నారని వినికిడి. బాలయ్య మాస్ హీరో… అటు బోయపాటి కూడా మాస్ దర్శకుడు కావడంతో సినిమాపై సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. సమ్మర్ స్పెషల్ గా సినిమాను తీసుకురాబోతున్నారట. ఇందులో హీరోయిన్ గా కంచె వంటి సినిమాలో నటించి మెప్పించిన ప్రగ్యా జైస్వాల్ ను తీసుకుంటున్నట్టు సమాచారం. ప్రగ్యా బాలయ్యతో కలిసి నటించడం ఇదే మొదటిసారి. కంచె తరువాత ఆమెకు మంచి విజయం లేదు. ఈ సినిమాతో అయినా ఆమెకు బ్రేక్ వస్తుందేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *