క్రీడలు
12 Views

సిడ్నీ: 2020, 2021 టీ20 ప్రపంచకప్‌ల తర్వాత తాను పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై పలికే అవకాశం ఉందని ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ వార్నర్‌ అన్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో, వచ్చే ఏడాది భారత్‌లో టీ20 ప్రపంచకప్‌లు జరగనున్న సంగతి తెలిసిందే. ”టీ20 ప్రపంచకప్‌లు వరుసగా ఉన్నాయి. బహుశా మరికొన్నేళ్లలో ఈ ఫార్మాట్‌ నుంచి తప్పుకోవచ్చు. ప్రస్తుతం తీరికలేని షెడ్యూల్‌తో అన్ని ఫార్మాట్లలో ఆడుతుండటం ఎంతో కష్టంగా ఉంది. ఎంతో కాలంగా అన్ని ఫార్మాట్లలో క్రికెట్‌ ఆడిన ఏబీ డివిలియర్స్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ వంటి ఆటగాళ్లతో మాట్లాడండి. వారు సవాలుగా అనిపించిందని చెబుతారు. అయితే అన్ని ఫార్మాట్లలో ఆడాలనుకుంటున్నా వారికి గుడ్‌లక్‌” అని వార్నర్‌ పేర్కొన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *