అభ్యర్థిపై రాళ్లదాడి.. పరిస్థితి విషమం..!

తెలంగాణ
77 Views

నల్గొండ : సహకార ఎన్నికల నేపథ్యంలో చిట్యాల పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. సహకార ఎన్నికల్లో కాంగ్రెస్‌ 3వ వార్డు అభ్యర్థిగా పోటీచేసిన గోధుమ గడ్డ జలందర్‌రెడ్డి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. మొహం, ఉదర భాగంలో రాళ్లతో చితకబాదారు. బాధితున్ని హుటాహుటిన హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనను స్థానికులు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఖండించారు. ఎన్నికల్లో నేరుగా తలపడలేక ప్రత్యర్థి వర్గంవారు రౌడీయిజానికి దిగారని ఆరోపించారు. ఘటనకు సంబంధించిన విజువల్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *