ట్రాఫిక్‌ పోలీసుల స్పెషల్‌ డ్రైవ్‌

తెలంగాణ
73 Views

ఎన్‌టీపీసీ పర్మినెంట్‌ టౌన్‌షిప్‌ ప్రధాన ద్వారాల వద్ద ట్రాఫిక్‌ పోలీసులు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. పలు మండలాల నుంచి ఎన్‌టీపీసీ కేంద్రీయ విద్యాలయం, సచ్‌దేవ స్కూల్‌, సేయింట్‌ క్లేర్‌ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఆటోలలో వెళ్తుండడంతో పరిమితికి మించి విద్యార్థులను తరలించడంపై దృష్టి సారించారు. బుధవారం ఏసీపీ రాంరెడ్డి ఆదేశాల మేరకు ఎన్‌టీపీసీ టౌన్‌షిప్‌లో ప్రత్యేక డ్రైవ్‌ ద్వారా ఆటోడ్రైవర్లకు ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తూ సరైన పత్రాలు, పరిమితికి మించి విద్యార్థులను తీసుకెళ్తున్న డ్రైవర్లకు జరిమానాలు విధించారు. ఈకార్యక్రమంలో ఎస్‌ఐలు కమలాకర్‌, సూర్యనారాయణ, నాగరాజు, కానిస్టేబుల్‌లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *