మేడారం జాతర హుండీల లెక్కింపు ప్రారంభం

తెలంగాణ
12 Views

వరంగల్‌: మేడారం మహా జాతర హుండీల లెక్కింపు బుధవారం ప్రారంభమైంది. హన్మకొండలోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపంలో హుండీల లెక్కింపు కొనసాగుతోంది. 200 మంది సిబ్బందితో 494 హుండీలను లెక్కించనున్నారు. హుండీల లెక్కింపు ప్రదేశంలో సీసీ కెమెరాలు, పోలీస్‌ భద్రత ఏర్పాటు చేశామని దేవాదాయశాఖ అధికారులు వెల్లడించారు. జాతరలో సమ్మక్క గద్దె వద్ద 202, సారలమ్మ గద్దె వద్ద 202, గోవింద రాజు గద్దె వద్ద 25 హుండీలు, పగిడిగిద్దరాజు గద్దె వద్ద 28, 38 బట్ట హుండీలను అధికారులు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *