ప్రసాదం పెడతానని తీసుకెళ్ళి దారుణంగా రేప్ చేసిన పూజారి..

క్రైమ్
73 Views

దేవుడి ముందు మంచి జరగాలని పూజలు చేయించి దేవుడికి నైవేద్యాన్ని సమర్పించిన పూజారి ప్రసాదం పెడతానని చెప్పి దారుణంగా రేప్ చేసిన ఘటన ఇప్పుడు అందరినీ కదిలించి వేస్తుంది..ఓ పూజారి చేసిన పనికి గుడిలో కూడా రక్షణ లేదని మహిళలు భయబ్రాంతులకు గురవుతున్నారు..ఓ మైనర్ బాలికపై కన్నేశాడు.

 

మేళాలో పూజల కోసం పూలు తీసుకొచ్చిన అమ్మాయిని.. లోపలికి తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డాడు. బాలికపై అమానుషంగా అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకి రావడంతో పోలీసులు నిందితుడైన స్వామీజీని అరెస్టు చేశారు. ఈ సంచలన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. ప్రయాగ్‌రాజ్‌లోని మేళా గ్రౌండ్‌లో పరమార్థ్ ఉత్థాన్ ఇవం అనుసంధాన్ సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

ఇది ఇలా ఉండగా మేళా గ్రౌండ్ సమీపంలో పూల దుకాణం నడుపుతున్న ఓ మహిళ పూజల కోసం పూలు పంపించేది. అయితే ఓ రోజు అమ్మాయిని పూలు ఇవ్వాలని కోరగా, ఆమె పూలు ఇచ్చి రావాల్సిందిగా తన కూతురిని పంపింది. అలా పూలు తీసుకొచ్చిన బాలికపై సంస్థ నిర్వాహకుడు సంజీవ్ మహరాజ్ అలియాస్ సంజీవ్ కుమార్ రాయ్ కన్నేశాడు. కామంతో కొట్టుకుంటున్న ఆ పూజారి లోనికి రా ప్రసాదం పెడతాను అని మాయమాటలు చెప్పి కిరాతకానికి పాల్పడ్డాడు. దీనితో అతి దారుణంగా ఆ అమ్మాయిని రేప్ చేసాడు.

బాలికకు మాయమాటలు చెప్పి లోపలికి తీసుకెళ్లాడు. ప్రసాదం పెడతానంటూ తీసుకెళ్లి అమానుషంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. స్వామీజీ బారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న బాలిక విషయం తల్లికి చెప్పింది. బిడ్డ జీవితం నాశనం చేసిన స్వామీజీపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె పోలీసులను ఆశ్రయించారు. సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని దేహ శుద్ధి చేసే పనిలో ఉన్నారు.. గుడిలో కూడా రక్షణ లేదంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *