జాతీయస్థాయి ఫెన్సింగ్ పోటీలకు రాష్ట్ర జట్టు

క్రీడలు
92 Views
కర్నూలు స్పోర్ట్స్ , ఫిబ్రవరి 11 , ( సీమ కిరణం న్యూస్ )  :
ఈనెల 15 నుంచి 19 వరకు గుజరాత్ రాష్ట్రంలో డిన్నర్ జిల్లాలో జరగనున్న 65వ జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనబోయే అండర్-14 బాలబాలికల ఆంధ్రప్రదేశ్ ఫెన్సింగ్ జట్టును కర్నూలు జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి శ్రీధర్ రెడ్డి మంగళవారం ప్రకటించారు.
బాలుర విభాగంలో :  సోహన్ శ్రీనివాస్, భార్గవ్ ,సాయి సుమంత్ , అభిషేక్, స్వర్ణ శ్రేయస్, తరుణ్ రెడ్డి, జగదీష్ , షామీర్ ,రామ్ వర్మ మోహిత్ ,బి.నవీన్ వీరికి శిక్షకులు గా లక్ష్మీనారాయణ, మేనేజరుగా లక్ష్మణ్ , సుధాకర్ లు వ్యవహరిస్తున్నట్టు తెలిపారు.
బాలికల విభాగంలో :  నాగ జాహ్నవి,దయానంద్,నాగేశ్వరి , మేఘన , పల్లవి, ముస్కాన్, సుస్మిత , షహనాజ్, మేఘన, ధరణి , సంధ్య, లావణ్య లు ఎంపికయ్యారని తెలిపారు.
ఈ సందర్భంగా మంగళవారం స్థానిక డి ఎస్ ఏ అవుట్డోర్ స్టేడియంలో జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో వివిధ జిల్లాలనుంచి హాజరైన క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ చేసి జాతీయ స్థాయిలో పథకాలు సాధించాలని జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు లక్ష్మయ్య క్రీడాకారులను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *