అండర్-19 వరల్డ్ కప్ విజేత బంగ్లాదేశ్. ఫైనల్లో టీమిండియా కుర్రాళ్లకు నిరాశ

క్రీడలు
83 Views

ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ చాంపియన్ గా అవతరించింది. దక్షిణాఫ్రికాలోని పోచెఫ్ స్ట్రూమ్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టీమిండియాపై 3 వికెట్ల తేడాతో విజయం సాధించిన బంగ్లాదేశ్ జూనియర్ కేటగిరీలో తొలి వరల్డ్ కప్ కైవసం చేసుకుంది. రోమాంఛకంగా సాగిన ఈ టైటిల్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 47.2 ఓవర్లలో 177 పరుగులకు ఆలౌట్ కాగా, లక్ష్యఛేదనలో అనేక ఉత్కంఠభరిత పరిస్థితులను అధిగమించిన బంగ్లాదేశ్ గెలుపు పరుగులు సాధించింది.

చివర్లో వర్షం పడడంతో బంగ్లా టార్గెట్ ను 46 ఓవర్లలో 170 పరుగులుగా నిర్దేశించారు. 7 వికెట్లు కోల్పోయిన బంగ్లా టైగర్స్ ఈజీగా టార్గెట్ అందుకున్నారు. ముఖ్యంగా, ఎంతో ఒత్తిడిలో కూడా సంయమనం కోల్పోకుండా ఆడిన బంగ్లాదేశ్ కెప్టెన్ అక్బర్ అలీ 43 పరుగులతో అజేయంగా నిలిచాడు. గత వరల్డ్ కప్ చాంపియన్ అయిన భారత్ ఈసారి రన్నరప్ తో సరిపెట్టుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *