హావెల్స్‌ నుంచి పర్యావరణహిత నీటి శుద్ధి పరికరాలు

బిజినెస్‌
87 Views

ఈనాడు, హైదరాబాద్‌: నీటి శుద్ధి పరికరాల మార్కెట్లో ఆరు శాతం మార్కెట్‌ వాటా సాధించే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు హావెల్స్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ శశాంక్‌ శ్రీవాస్తవ్‌ తెలిపారు. అధునాతన సాంకేతికతతో రూపొందించిన ఆల్కలైన్‌ వాటర్‌ ప్యూరిఫైయ్యర్లను విడుదల చేసిన సందర్భంగా మాట్లాడుతూ.. శుద్ధమైన, ఆరోగ్యానికి మేలు చేసే నీటిని అందించడంతోపాటు, 50 శాతం తక్కువ నీటి వృథాతో తీసుకొచ్చినట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా వ్యవస్థీకృత నీటి శుద్ధి పరికరాల మార్కెట్‌ విలువ రూ. 4,500 కోట్ల వరకూ ఉందన్నారు. మరో రూ.2,000 కోట్ల వరకూ అవ్యవస్థీకృత రంగం నుంచి అమ్ముడవుతున్నాయని తెలిపారు. ఏటా 10శాతం వృద్ధి నమోదవుతోందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం మార్కెట్‌ విలువ ఏటా రూ.120 కోట్ల వరకూ ఉందని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *